తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • వాతావరణ శాఖ వెల్లడి.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ 
  • హైదరాబాద్​లో మోస్తరు వానలు పడే చాన్స్ 


హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని మంగళవారం తెలిపింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పింది. హైదరాబాద్​లోనూ రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది.