
యువత ఆన్ లైన్ గేమింగ్ మాయపడి భవిష్యత్తును, చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ లో డబ్బులు పెట్టి నష్టం రావడంతో కొందరు, ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ సమయాన్ని వృధా చేస్తూ.. పేరెంట్స్ మందలిస్తే ఇంకొందరు ..ఇలా ప్రాణామీదకు తెచ్చుకుంటున్నారు. గురువారం (సెప్టెంబర్18) జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటుపడి.. వద్దు అని చెప్పినందుకు ఉరివేసుకొని చనిపోయిన ఘటన జరిగింది.
జగిత్యాలలో మరో యువకుడు ఆ గేమింగ్ కు బానిసగా మారి ప్రాణాలు కోల్పోయాడు. విద్యానగర్‌కు చెందిన రాహుల్.. బీటెక్ డిస్కంటిన్యూ అయ్యి.. కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. సమయం గడపటానికి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. కానీ అది అలవాటై.. వ్యసనంగా మారింది. ప్రతిరోజూ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి శ్రీనివాస్ మందలించారు.
దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ కోపంతో.. నిరాశతో.. ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కాగానొక్క కొడుకుని కోల్పోయిన తండ్రి, తల్లి గుండెలవిసేలా విలపిస్తున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.