IND vs ENG 2025: నీకొక దండం.. నీకంటే కృనాల్ పాండ్య బెటర్: టీమిండియా పేసర్‌పై నెటిజన్స్ సెటైర్

IND vs ENG 2025: నీకొక దండం.. నీకంటే కృనాల్ పాండ్య బెటర్: టీమిండియా పేసర్‌పై నెటిజన్స్ సెటైర్

హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ప్రసిద్ కృష్ణను కాదని కంబోజ్ కు ఛాన్స్ ఇవ్వడం విశేషం. బుధవారం (జూలై 23) ఓల్డ్ ట్రాఫోర్డ్ లో మొదలైన ఈ టెస్టులో గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో కాంబోజ్ కు స్థానం దక్కింది. దీంతో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన 318 ప్లేయర్ నిలిచాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేసిన ఈ హర్యానా స్పీడ్ స్టర్ అంతర్జాతీయ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఓవరాల్ గా 18 ఓవర్లలో 89 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. 

నాలుగో టెస్టులో కాంబోజ్ విఫలమైన సంగతి పక్కన పెడితే అతను బౌలింగ్ చేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కనీసం 130కి. మీ వేగంతో ఈ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఒక వైపు స్వింగ్ చేయలేక.. మరోవైపు తన పేస్ లో పదును లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అలవోకగా కాంబోజ్ ను ఆడేశారు. ఈ హర్యానా పేసర్ యావరేజ్ స్పీడ్ 128 కి.మీ మాత్రమే కావడం షాక్ కు గురి చేస్తుంది. ఇతని బౌలింగ్ చూసిన టీమిండియా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. కనీస వేగంతో పేస్ వేయలేకపోతున్నాడని.. నెటిజన్స్ నిరాశ చెందుతున్నారు. కొందమైందేయితే కాంబోజ్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

కాంబోజ్ కు అనవసరంగా టీంఇండియాలో చోటు ఇచ్చారని మండిపడుతున్నారు. కాంబోజ్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడని కౌంటర్లు విసురుతున్నారు. కొంతమంది నెటిజన్స్ కాంబోజ్ బదులు భువనేశ్వర్ ను జట్టులోకి తీసుకున్నా బావుండేది అని సలహాలు ఇస్తున్నారు. కాంబోజ్ చివరి టెస్టులో ఛాన్స్ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. పేలవ బౌలింగ్ తో పాటు చివరి టెస్టులో అర్షదీప్ ఫిట్ అవ్వడం కాంబోజ్ కు మైనస్ గా మారింది. కాంబోజ్ స్థానంలో చివరిదైన ఐదో టెస్టుకు అర్షదీప్ సింగ్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉంది.