కాకా క్రికెట్ టోర్నీలో...అంతర్గాం, ఎన్టీపీసీ జట్ల విజయం

కాకా క్రికెట్ టోర్నీలో...అంతర్గాం, ఎన్టీపీసీ జట్ల విజయం

గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ  శుక్రవారం కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్ అంతర్గాం, పాలకుర్తి  జట్ల మధ్య జరగ్గా అంతర్గాం గెలిచింది. 18 ఓవర్లలో అంతర్గాం జట్టు వికెట్లు మొత్తం నష్టపోయి 137  రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన పాలకుర్తి  18  ఓవర్లలో ఎనిమిది  వికెట్ల నష్టానికి 132  రన్స్ మాత్రమే చేసింది. అంతర్గాం జట్టులో తరుణ్​కుమార్​28 బాల్స్​లో 38 రన్స్​, రాకేశ్17 బాల్స్ లో 21 పరుగులు, పాలకుర్తి  జట్టులో వేల్పుల అనిల్​ 29 బాల్స్ లో 52  రన్స్ చేసి ప్రతిభ కనబరిచారు.

అంతర్గాం జట్టుకు చెందిన దయాకర్​కు మ్యాన్​ఆఫ్​ది మ్యాచ్​అవార్డు దక్కింది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్​లో యైటింక్లయిన్​కాలనీ, ఎన్టీపీసీ  జట్లు తలపడగా ఎన్టీపీసీ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన యైటింక్లయిన్​ కాలనీ 19.5  ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి117  రన్స్ చేయగా ఎన్టీపీసీ  జట్టు 17  ఓవర్లలో ఐదు  వికెట్లు కోల్పోయి 121  రన్స్ చేసింది. ఎన్టీపీసీ జట్టులో జావిద్​ 46 బాల్స్​లో 54 ,  యైటింక్లయిన్​ కాలనీ జట్టులో రిషి మాధవ్​ 37 బాల్స్​లో 41 రన్స్​ చేశారు. మూడు వికెట్లు తీసిన ఎన్టీపీసీ జట్టుకు చెందిన హరీశ్​రెడ్డికి మ్యాన్​ఆఫ్ ది మ్యాచ్​ప్రకటించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

కాకా ఫౌండేషన్​ కప్​ సిరీస్​లో సుల్తానాబాద్ ​విక్టరీ

పెద్దపల్లి, వెలుగు: కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ క్రికెట్​టోర్నమెంటులో భాగంగా పెద్దపల్లిలో నిర్వహిస్తున్న లీగ్​  మ్యాచ్​లో సుల్తానాబాద్​జట్టు విజయం సాధించింది. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్​లో సుల్తానాబాద్, ఓదెల మండలాల మధ్య మ్యాచ్​జరిగింది. మొదట బ్యాటింగ్​చేసిన ఓదెల 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 62 రన్స్​ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన సుల్తానాబాద్​15 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 66 రన్స్​చేసింది. అత్యధిక పరుగులు చేసిన సుల్తానాబాద్​జట్టుకు చెందిన క్రాంతికి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.