వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అంతిమ్‌‌‌‌కు కాంస్యం

 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అంతిమ్‌‌‌‌కు కాంస్యం

జాగ్రెబ్ ( క్రొయేషియా): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా యంగ్‌‌‌‌స్టర్ అంతిమ్ పంగల్ వరుసగా రెండోసారి పతకం తెచ్చింది. విమెన్స్ 51 కేజీ పోటీలో  కాంస్యం గెలిచి తాజా ఎడిషన్‌లో  ఇండియాకు ఏకైక పతకం అందించింది. 21 ఏండ్ల అంతిమ్ గురువారం కాంస్య పతకం కోసం జరిగిన బౌట్‌‌‌‌లో 9–-1 తేడాతో అండర్ 23 వరల్డ్ చాంప్ ఎమ్మా  జొనా డెనిస్ (స్వీడన్‌‌‌‌) ఘన విజయం సాధించింది. గతేడాది కూడా కాంస్యం నెగ్గిన అంతిమ్‌‌‌‌ ఈ టోర్నీలో రెండు మెడల్స్ గెలిచిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సరసన నిలిచింది.