కొంతమందికి తినేటప్పుడు గొంతులో అన్నం ఇరుక్కుపోతుంటుంది.. కానీ.. ఈ గాడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఉంటే..

కొంతమందికి తినేటప్పుడు గొంతులో అన్నం ఇరుక్కుపోతుంటుంది.. కానీ.. ఈ గాడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఉంటే..

కొంతమందికి తినేటప్పుడు గొంతులో అన్నం ఇరుక్కుపోతుంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ.. ఇలాంటి గాడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఉంటే క్షణాల్లో వాళ్లను కాపాడొచ్చు. దీన్ని సొన్మోల్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. గొంతులో ఫుడ్‌‌‌‌‌‌‌‌ లేదా ఇతర ఆబ్జెక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఇరుక్కుపోయి ఊపిరాడనప్పుడు దీన్ని నోటి దగ్గర పెట్టి ఒక బటన్ నొక్కితే చాలు. అడ్డుపడిన ఫుడ్‌‌‌‌‌‌‌‌ని 33కేపీఏ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బయటకు లాగేస్తుంది.

ముఖ్యంగా పిల్లలు, వయసు పైబడిన పెద్దలకు అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్యాక్‌‌‌‌‌‌‌‌లో గాడ్జెట్‌‌‌‌‌‌‌‌తో పాటు పసివాళ్లు, పిల్లలు, పెద్దల కోసం మూడు వేర్వేరు సైజు మాస్కులు వస్తాయి. దీంతో సెల్ఫ్ రెస్క్యూ కూడా చేసుకోవచ్చు. ఇది పోర్టబుల్, లైట్‌‌‌‌‌‌‌‌వెయిట్ డిజైన్‌‌‌‌‌‌‌‌తో రావడం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. హై క్వాలిటీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌తో తయారు చేయడం వల్ల చాలా కాలం మన్నికగా ఉంటుంది.

ధర: 3 వేల 997 రూపాయలు

►ALSO READ | జ్యోతిష్యం :  శని నక్షత్రం మారాడు.. నాలుగు రాశుల వారికి రాజయోగం.. చేతినిండా డబ్బే..!