ఈ శిల్పం పేరు నైఫ్ఏంజెల్. దీన్ని బ్రిటీష్ ఐరన్‌వర్క్ సెంటర్ లో దాదాపు లక్ష బ్లేడెడ్ ఆయుధాలతో 8 మీటర్ల ఎత్తులో రెండు సంవత్సరాల పాటు తయారు చేసి 2017లో పూర్తి చేశారు. హింసాత్మక నేరాల గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని రూపొందించారు. తాజాగా దీన్ని యూకేలోని స్లఫ్ లోని ఆర్బర్ పార్క్ స్టేడియంకు తీసుకువచ్చారు. ఈ నెలంతా ఇక్కడ అవగాహన కల్పించనున్నారు.
