చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!

చికెన్ తింటున్నారా.. అయితే  యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!

నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్​ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్​ వాడకం పెరిగిపోతున్నది. ఎక్కువగా కోళ్లలోనే యాంటీ బయాటిక్స్ ​రెసిస్టెన్స్​పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. కోళ్లలో యాంపిసిల్లిన్​రెసిస్టెన్స్ 53 శాతం, సెఫోటాక్సిమ్​ రెసిస్టెన్స్​51 శాతం, టెట్రాసైక్లిన్​ రెసిస్టెన్స్​50 శాతం, నాలిడిక్సిక్​యాసిడ్ రెసిస్టెన్స్​ 47 శాతం వరకు ఉన్నట్టు వెల్లడించింది. 

అమోక్సోక్లావ్, ఎన్రోఫ్లోక్సాసిన్, అమికాసిన్, ఇమిపీనమ్​ వంటి యాంటీ బయాటిక్స్​కు 40 శాతం వరకు రెసిస్టెన్స్​ఉన్నట్టు పేర్కొంది. కోళ్ల పెంపకంలో యాంటీ బయాటిక్స్​వాడకం ఎక్కువగా ఉండడం వల్లే, వాటిలో యాంటీ బయాటిక్స్​కు నిరోధకత పెరుగుతున్నట్టు హెచ్చరించింది. ప్రతి యాంటీ బయాటిక్​కు కోళ్లలో ఎంతో కొంత రెసిస్టెన్స్​ఉన్నట్టు స్టడీ స్పష్టం చేసింది. 

మల్టీ డ్రగ్​రెసిస్టెన్స్​కోళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించింది. మేకల్లో సెఫొటాక్సిమ్​రెసిస్టెన్స్​ 41 శాతం ఉండగా అమికాసిన్​కు 35 శాతం, యాంపిసిల్లిన్​కు 26 శాతం దాకా నిరోధకత పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. అదే గొర్లలో కొంచెం తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. వాటిల్లో 37 శాతం వరకు రెసిస్టెన్స్​ ఉంటున్నట్టు వెల్లడించింది. యాంటీ బయాటిక్స్​వాడకం గొర్లు, మేకల్లోనూ క్రమక్రమంగా పెరుగుతున్నదని హెచ్చరించింది.