కరోనా డెత్ రిస్క్‌ను తగ్గిస్తున్న యాంటీ బాడీ డ్రగ్

కరోనా డెత్ రిస్క్‌ను తగ్గిస్తున్న యాంటీ బాడీ డ్రగ్

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్స్‌లో డెత్ రిస్క్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న యాంటీ బాడీ డ్రగ్ బాగా పని చేస్తోంది. ఇంటెన్సివ్ కేర్‌‌లో అడ్మిట్ అయిన పేషెంట్స్‌కు యాంటీ బాడీ డ్రగ్‌ ఇవ్వడం ద్వారా హెల్త్ కండీషన్‌ను మోడరేట్‌ చేయొచ్చని క్యూబాలో ప్రూవ్ అయింది. క్యూబాలో నిర్వహించిన ఓ చిన్న స్టడీలో ఈ విషయం నిరూపితమైంది. ఇండియాలో ఇటోలిజుమాబ్‌ను వాడటానికి బయోకాన్ లిమిటెడ్‌కు రెగ్యులేటరీ అప్రూవల్ వచ్చిందని తెలిసింది. సోరియాసిస్‌ ట్రీట్‌మెంట్ కోసం వాడే ఇటోలిజుమాబ్‌ను కరోనా వల్ల తలెత్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్‌కు వాడుతున్నారు. కరోనా వల్ల పేషెంట్స్‌ ఆరోగ్య స్థితి దిగజారితే ఇటోలిజుమాబ్‌ను వాడొచ్చని క్యూబాలోని సెంటర్ ఆఫ్ మాలిక్యులర్ ఇమ్యునాలజీ రీసెర్చర్స్ తెలిపారు.

క్యూబాలో 19 మంది వృద్ధులను కరోనా సోకడంతో ఏప్రిల్‌లో నర్సింగ్ హోమ్స్‌లో చేరారు. వీరిలో అందరూ 64 ఏళ్లకు పైబడ్డ వారు ఉండటం గమనార్హం. అందరూ హైపర్ టెన్షన్, డెమెంటియా, హార్ట్‌ డిసీజ్, డయాబెటిస్, లంగ్ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. వీరి వయస్సు, హెల్త్‌ ఇష్యూస్ వల్ల కరోనాతో ఎక్కువ రిస్క్ ఉండే ప్రమాదం ఉందని రీసెర్చర్స్ చెప్పారు. ఈ పేషెంట్స్‌కు ఒకటి, రెండు సార్లు ఇటోలిజుమాబ్‌ డోసులు ఇచ్చామన్నారు. దీంట్లో కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్, యాంటీబయోటిక్స్, క్లోరోక్విన్, ఇంటర్‌‌ఫెరోన్‌ ఉన్నాయని రీసెర్చర్స్ తెలిపారు. పేషెంట్స్‌కు మొదటి డోస్ ఇచ్చిన తర్వాత ఇద్దరు పేషెంట్స్‌కు మాత్రమే ఆక్సీజన్ థెరపీ అవసరం ఏర్పడిందన్నారు. ఇతర పేషెంట్స్‌తో పోలిస్తే ఐసీయూల్లో ఉన్న ప్రతి ముగ్గురు పేషెంట్స్‌లో ఒకరిని, చనిపోయే ప్రమాదం ఉన్న ఒకరిని కాపాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటోలిజుమాబ్ వాడటం వల్ల బ్లడ్ లెవల్స్ 24 నుంచి 48 గంటల్లో కంట్రోల్ చేయొచ్చన్నారు.