పారిస్‌‌ ఒలింపిక్స్‌‌కు అంతిమ్‌‌ క్వాలిఫై

పారిస్‌‌ ఒలింపిక్స్‌‌కు అంతిమ్‌‌ క్వాలిఫై

బెల్‌‌గ్రేడ్‌‌ : ఇండియా యంగ్‌‌ రెజ్లర్‌‌ అంతిమ్‌‌ పంగల్‌‌.. రెజ్లింగ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో డబుల్‌‌ ధమాకా సాధించింది. విమెన్స్‌‌ 53 కేజీల విభాగంలో బ్రాంజ్‌‌ మెడల్‌‌ను గెలవడంతో పాటు పారిస్‌‌ ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన బ్రాంజ్‌‌ మెడల్‌‌ ప్లే ఆఫ్స్‌‌ బౌట్‌‌లో అంతిమ్‌‌ 16–6తో ఎమ్మా జొన్నా డెనిసి మల్మాగ్రిన్‌‌ (స్వీడన్‌‌)పై గెలిచింది. దీంతో ఇండియా తరఫున వరల్డ్స్‌‌లో బ్రాంజ్‌‌ నెగ్గిన ఆరో రెజ్లర్‌‌గా రికార్డులకెక్కింది.

ఇంతకుముందు గీత ఫోగట్‌‌ (2012), బబితా ఫోగట్‌‌ (2012), పూజ దండా (2018), వినేశ్‌‌ ఫోగట్‌‌ (2019), అన్షు మాలిక్‌‌ (సిల్వర్‌‌) వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మెడల్స్‌‌ సాధించారు. ఇక ఇండియా నుంచి రెజ్లింగ్‌‌లో అంతిమ్‌‌దే తొలి ఒలింపిక్‌‌ కోటా కావడం విశేషం. బౌట్‌‌ ఆరంభం నుంచి అద్భుతమైన పట్టుతో చెలరేగిన అంతిమ్‌‌ చివరి వరకు దాన్ని కొనసాగించింది.

గ్రీకో రోమన్‌‌ విభాగంలో ఇండియన్‌‌ రెజ్లర్లు నిరాశపర్చారు. సాజన్‌‌ భన్వాల (82 కేజీ) తొలి రౌండ్‌‌లోనే వెనుదిరిగాడు. గురుప్రీత్‌‌  సింగ్‌‌ (77 కేజీ), మెహర్‌‌ సింగ్‌‌ (130 కేజీ) అంచనాలను అందుకోలేకపోయారు.