KATTALAN: ‘మార్కో’ టీమ్ మరో థ్రిల్లర్‌.. ఫస్ట్ లుక్ తోనే కాకా రేపిన ఆంటోనీ వర్గీస్‌

KATTALAN: ‘మార్కో’ టీమ్ మరో థ్రిల్లర్‌.. ఫస్ట్ లుక్ తోనే కాకా రేపిన ఆంటోనీ వర్గీస్‌

మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్‌‌ లీడ్ రోల్‌‌లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్‌‌’. పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ‘మార్కో’ లాంటి పాన్‌‌ ఇండియా సినిమా హిట్ తర్వాత కాటాలన్ క్యూబ్స్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో హీరో ఆంటోనీ వర్గీస్‌‌ మాస్‌‌ అవతార్‌‌‌‌లో, ఇంటెన్స్‌‌ లుక్‌‌లో కనిపించాడు. సునీల్, కబీర్ దుహాన్‌‌ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రాపర్ బేబీ జీన్, ‘పుష్ప’ ఫేమ్ రాజ్ తిరందాసు, ‘కిల్’ ఫేమ్ పార్థ్ తివారి, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా రిలీజ్ కానుంది. 

మార్కో మూవీ:

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి మలయాళ ప్రముఖ డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ క్యూబ్స్ షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. మార్కో సినిమా గత ఏడాది 2024 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది.

దాదాపు రూ.30 కోట్లు బడ్జెట్ తో తీసిన ఈ మూవీ, రూ.100 కోట్లు పైగా కలెక్ట్ చేసి దుమ్మురేపింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, మితిమీరిన హింస, ఎలివేషన్ సీన్స్ సినిమాను ప్లస్ పాయింట్స్ అవ్వగా.. ఇదే క్రమంలో అవే మైనస్ గా నిలిచాయి కూడా.