ఇండియా–ఎ జట్టులో అనుకుల్‌‌‌‌ రాయ్‌‌‌‌

ఇండియా–ఎ జట్టులో అనుకుల్‌‌‌‌ రాయ్‌‌‌‌

న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా–ఎ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. ఆల్‌‌‌‌రౌండర్ అనుకుల్ రాయ్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అఫ్గానిస్తాన్‌‌‌‌తో  టెస్టు, వన్డే సిరీస్‌‌‌‌లకు హర్ష్ దూబే తొలిసారి టీమిండియాకు ఎంపిక అయ్యాడు. దాంతో అతని స్థానంలో అనుకుల్ రాయ్‌‌‌‌ను ఇండియా–ఎ టీమ్‌‌‌‌లోకి తీసుకున్నట్లు బీసీసీఐ గురువారం వెల్లడించింది. 

లెఫ్టార్మ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ కమ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అయిన అనుకుల్ రాయ్.. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో జార్ఖండ్ తరఫున, ఐపీఎల్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌  తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018 అండర్–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 14 వికెట్లు తీసిన అనుకుల్‌‌‌‌ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌‌‌గా నిలిచాడు. ఇండియా–ఎతో పాటు అఫ్గానిస్తాన్‌‌‌‌–ఎ, శ్రీలంక–ఎ జట్ల మధ్య దంబుల్లాలో జూన్‌‌‌‌ 9 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.