
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 70 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచేందుకు భారీగా ప్రచారం చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యలపై సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కాబట్టి ఎవరూ పలకరింపుగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మన భారతీయ సంప్రదాయమే బెస్ట్ అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశారు.
వెనక్కి వెళ్లి.. కాపాడుకుందాం
‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తరచూ చేతులు కడుక్కోవడం మంచిదని నాకు చాలా మంది చెప్పారు. నేను అలానే చేస్తా. కానీ, మనం వెనక్కి వెళ్లి బారతీయ సంప్రదాయంలో పలకరించుకుంటే మేలు అని నా అభిప్రాయం. షేక్ హ్యాండ్ బదులు నమస్తే అని పలకరించుకుందాం. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇది చాలా సురక్షితమైన మార్గం. దీన్ని పాటిస్తే తాకడం ద్వారా కరోనా వస్తుందన్న భయం ఉండదు’ అని చెబుతూ ట్వీట్ చేశారు అనుపమ్ ఖేర్. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాదాపు 12 గంటల్లోపే లక్ష మంది దీనిని చూశారు. 13 వేల మంది లైక్ చేయగా… దాదాపు 1700 మంది రీట్వీట్ చేశారు.
Of late I am being told by lots of people to keep washing hands to prevent any kind of infection. I do that in any case. But also want to suggest the age old Indian way of greeting people called #Namaste. It is hygienic, friendly & centres your energies. Try it. ?? #caronavirus pic.twitter.com/ix7e6S8Abp
— Anupam Kher (@AnupamPKher) March 3, 2020