ఆమెను చంపడం కరెక్టే.. ఇవాళ కాకపోతే రేపు నా కొడుకులను బయటకు తీసుకొస్తా..ప్రియుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

ఆమెను చంపడం కరెక్టే.. ఇవాళ కాకపోతే  రేపు నా కొడుకులను బయటకు తీసుకొస్తా..ప్రియుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లోని  జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ  ప్రేమకు అడ్డుగా ఉందని తన  తల్లిని.. ప్రియుడితో కలిసి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో నిందితుడు  డీజే శివ తల్లి సంతోషి  సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కొడుకులు అంజలిని చంపడంలో తప్పు లేదని సమర్ధించుకుంటోంది. 

ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి మా ఇంటికి వస్తూ ఉండేది.. అమ్మాయి తల్లి అంజలిని చంపడం కరెక్టే.. మేం తప్పు చేయలేదు. తప్పంతా ఆ అమ్మాయిదే.. మ్యాటర్ అంతా అమ్మాయి దగ్గరే ఉంది. అమ్మాయి బయటపడితే అసలు విషయం బయటకొస్తుంది. టెన్షన్ ఏం లేదు.. చేసేదేముంది.? ఇవాళ కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను జైలు నుంచి బయటకు తీసుకొస్తా..  అంజలి మా ఇంటికి రావడం..మాపై కేసు పెట్టడం తప్పు.. ఆమెను చంపడమే కరెక్ట్..  అమ్మాయి తల్లి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి..మా ఇంటికి వచ్చినప్పుడే కేసు పెటట్టడం ఏంటి.? ఆమె చేసింది ముమ్మాటికీ తప్పే.. అంటూ శివ తల్లి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

19 సంవత్సరాల వయస్సు ఉన్న శివ డీజే గ్రూపులో పని చేస్తుంటాడు.. ఇన్ స్ట్రాలో పరిచయం అయ్యింది తేజశ్రీ. పదో తరగతి చదువుతున్న తేజశ్రీ వయస్సు 16 ఏళ్లు మాత్రమే. వీళ్లిద్దరికీ పరిచయం అయ్యి ఎనిమిది నెలలే అయినా.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన తల్లి అంజలి.. పదే పదే వద్దని చెబుతూ వచ్చేది. శివతో ప్రేమ వ్యవహారం వద్దంటూ కొన్ని సార్లు కొట్టింది కూడా. తన ప్రేమకు తల్లి అంజలినే కారణం అంటూ.. కక్ష పెంచుకున్నది కుమార్తె తేజశ్రీ.. ఈ క్రమంలోనే తన ప్రియుడు శివ, అతని తమ్ముడు.. వాడికి కూడా 16 సంవత్సరాలే.. ఇద్దరితో కలిసి తన తల్లిని చంపటానికి ప్లాన్ వేసింది. 

►ALSO READ | మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి పూర్తిగా చంపి వెళ్లు : ప్రియుడికి కాల్ చేసిన పదో తరగతి ప్రియురాలు

ఇంట్లో తాను మాత్రమే ఉన్న సమయంలో.. తన తల్లిని చంపటానికి తన ప్రియుడు శివ, అతని తమ్ముడిని ఇంటికి పిలిపించింది. ఇంట్లో పూజ చేసుకుంటున్న తల్లి అంజలిని.. చున్నీతో గొంతు బిగించారు. చనిపోయిందని భావించి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంజలి కాళ్లు, చేతులు ఆడిస్తుండటంతో.. తన ప్రియుడికి కాల్ చేసింది తేజశ్రీ. మా అమ్మ ఇంకా చనిపోలేదు.. సగం చంపి వెళితే ఎలా.. వచ్చి పూర్తిగా చంపేసి వెళ్లు అంటూ శివకు కాల్ చేసింది తేజశ్రీ.

ఇంటి నుంచి సగం దూరం వెళ్లిన శివ, అతని తమ్ముడు.. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి పూర్తిగా చంపేసి వెళ్లారు. తన తల్లిని చంపటానికి ప్రేరేపించింది.. ప్లాన్ వేసింది అంతా కూడా పదో తరగతి చదువుతున్న 16 ఏళ్లు తేజశ్రీనే అని బాలానగర్ పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారంతోపాటు తల్లిపై ద్వేషం ఉందని.. తన తల్లి ఎప్పుడూ తనను ప్రేమగా చూడలేదని.. ఎప్పుడూ కొడుతూ ఉండేదని.. తిడుతూ ఉంటుందని విచారణలో తేజశ్రీ చెప్పినట్లు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. 

నిందితుల వయస్సు రీత్యా చట్టం ప్రకారం.. కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని.. కుమార్తె తేజశ్రీ ప్రోద్బలం వల్లే ఈ హత్య జరిగిందని వివరించారు డీసీపీ. అంజలి కుటుంబం 20 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటుందని.. వాళ్ల సొంతూరు మహబూబాబాద్ జిల్లా అని.. హైదరాబాద్ లోని తెలంగాణ సాంస్కృతిక కళా మండలిలో పని చేస్తుందని స్పష్టం చేశారు పోలీసులు. విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడిాంచారు.