షాకింగ్ ఇన్సిడెంట్.. బెడ్రూమ్లో షర్ట్ కాలర్ మేకుకు పట్టుకుని.. 11 ఏళ్ల బాలుడు మృతి..

షాకింగ్ ఇన్సిడెంట్.. బెడ్రూమ్లో షర్ట్ కాలర్ మేకుకు పట్టుకుని.. 11 ఏళ్ల బాలుడు మృతి..

ఆ బాలుడి వయసు కేవలం 11 ఏళ్లు.. 6వ తరగతి చదువుతున్నాడు. ఇళ్లంతా సందడిగా ఆడుతూ ఉన్నాడు. అదే విధంగా బెడ్ పై గెంతుతూ ఆడుకుంటున్నాడు. కానీ గోడకు కొట్టిన మేకు ఆ బాలుని పాలిట యమపాశం అయ్యింది. లోకం అంటే కూడా తెలియని ఆ బాబును ఈ ప్రపంచానికి దూరం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని మల్లాపురంలో జరిగింది ఈ హృదయ విదారక ఘటన. వల్లికంజీరం లో నివసిస్తున్న మణికందన్, దివ్య కుమారుడు ధ్వనిత్ (11) 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం (జూన్ 20) ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో ఆడుకుంటున్నాడు. ప్రమాద వషాత్తు ఆ బాలుడి షర్ట్ కాలర్ (గళ్ల) మేకుకు పట్టుకుంది. అది గొంతుకు బిగ్గరగా కావడంతో గిలిగిల కొట్టుకున్నాడు.

ALSO READ | Viral Video: రియల్ హీరో..చిరుతతో కుస్తి పట్టిన యువకుడు..సినిమా ఫైటింగ్ తలపించిన సీన్

బాబు అరుపులు విని హాల్ లో ఉన్న పేరెంట్స్ వచ్చి చూసేసరికి గొంతుకు కాలర్ బిగుతుగా అయ్యి అల్లాడుతున్న ధ్వనిత్ ను చూశారు పేరెంట్స్. వెంటనే విడిపించి తిరూర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడికి ట్రీట్ మెంట్ అందించిన తర్వాత కండిషన్ క్రిటికల్ గా ఉందని.. కోజికోడ్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కోజికొడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే ధ్వనిత్  చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే చనిపోయాడు. పోస్ట్ మార్టం నిర్వహించి పేరెంట్స్ కు అప్పగించారు ఆ పిల్లాడి మృతదేహాన్ని.

ఈ ఇన్సిడెంట్.. గ్రామంతో పాటు కేరళ రాష్ట్రంలో.. దేశంలో కూడా వైరల్ గా మారింది. బంగారు భవిష్యత్తు ఉన్న బాలుడు అకారణంగా చనిపోవడం దేశం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటన తర్వాత.. పిల్లలు ఏం చేస్తున్నారో.. ఏ పరిస్థితుల్లో ఉన్నారో.. పేరెంట్స్ ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు చెబుతున్నారు. లేదంటే ఇలాంటి అనర్థాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.