Viral Video: రియల్ హీరో..చిరుతతో కుస్తి పట్టిన యువకుడు..సినిమా ఫైటింగ్ తలపించిన సీన్

Viral Video: రియల్ హీరో..చిరుతతో కుస్తి పట్టిన యువకుడు..సినిమా ఫైటింగ్ తలపించిన సీన్

యదార్థ సంఘటన.. పాత కాలం సినిమాల్లో పులితో, సింహంతో ఫైట్ సీన్లు చూస్తుంటాం కదా..హీరోలు వాటితో పోరాడుతున్న సీన్లు చూస్తుంటే ఒళ్లు గగుర్లు పొడిచేవి..మరి నిజంగా ఓ వ్యక్తి చిరుత తో పోరాడుతున్న దృశ్యాలు చూస్తే ఎలా ఉంటుంది..సోషల్ మీడియా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. యూపీకి చెందిన ఓ యువకుడు చిరుతతో పోరాడుతున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..యువకుడి ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు.. వివరాల్లోకి వెళితే.. 

అది యూపీలోని లఖింపూర్ ఖేరీ పరిధిలోని ధౌర్ పూర్ అటవీప్రాంతాల్లోని జుగ్నుపూర్ గ్రామం..గ్రామ సమీపంలో ఇటుక బట్టీలో కార్మికులపై సోమవారం (జూన్ 23) నల్ల చిరుత పులి దాడి చేసింది. సేమ్ టు సినిమా సీన్లను తలపించాయి చిరుతపులితో యువకుడి పోరాట దృశ్యాలు.  ఆ యువకుడు చిరుతను పడగొట్టి, దాని నోటిని పట్టుకొని నేలకు అదిమిపట్టి లొంగదీసుకున్న దృశ్యాలు పాత కాలం సినిమాల్లో ఎన్టీఆర్, కాంతారావు సినిమాల్లోని సీన్లను గుర్తుకు తెచ్చాయి. ఈ వీడియో చూసేవారందరికి గూస్ బంప్స్ వచ్చాయి.  

ALSO READ | NEET మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతుర్ని చచ్చేవరకు కొట్టిన తండ్రి !

జుగ్నుపూర్ లోని ఓ ఇటుక బట్టీ చిమ్నీలో దాక్కున్న చిరుతపులి.. గిర్ధారిపూర్వాకు చెందిన 35 ఏళ్ల మిహిలాల్‌పై దాడి చేసింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న రైతులు వచ్చి చిరుతపులిని ఇటుకలు ,రాళ్లతో కొట్టారు.  దీంతో చిరుత బాదితుడు మిహిలాల్ ను విడిచిపెట్టి అరటి తోటలోకి పారిపోయింది. గ్రామస్తులు వెంటనే ప్రాంతీయ అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ఆ యువకుడి పోరాటానికి గ్రామస్తులు కూడా వారి వంతు సాయం అందించారు. పైనుంచి గురిచూసి చిరుతను ఇటుకలతో కొట్టారు. దీంతో చిరుతకు గాయాలయ్యాయి. చిరుత దాడిలో యువకుడు కూడా గాయపడ్డాడు.విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఐదుగురు అటవీశాఖ అధికారులకు కూడా చిరుత దాడిలో గాయాలయ్యాయి. 

దాదాపు గంటపాటు సాగిన నాటకీయ పరిణామాల తర్వాత చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు గ్రామస్తుల సాయం బంధించారు. చిరుతను వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుతతో వీరోచిత పోరాటం చేసిన యువకుడిని అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు అభినందించారు.