Paradha: లాపతాలేడీస్ తరహాలో.. అనుపమ పరమేశ్వరన్ పరదా

Paradha: లాపతాలేడీస్ తరహాలో.. అనుపమ పరమేశ్వరన్ పరదా

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో  శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించిన  చిత్రం ‘పరదా’.  దర్శన రాజేంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగీత,  రాగ్ మయూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది.

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ ‘ఈ కథ నాకు తెలుసు.  ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘లాపతాలేడీస్’ లాంటి సినిమా ఇది. ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే నిర్మాతలకి  ధైర్యం వస్తుంది. అనుపమకు ఎలాంటి  క్యారెక్టర్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్ పెడుతుంది.

►ALSO READ | MassJatharaTeaser: ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్.. అభిమానులకు రవితేజ, శ్రీలీల ఫుల్ మీల్స్..

ఈ సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందరూ కచ్చితంగా చూడాలి’ అని చెప్పాడు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. రామ్ లాంటి ఫ్రెండ్ ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన  బిజీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా కోసం వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది.  ఇందులో అనుపమ కొత్త వెర్షన్ చూడబోతున్నారని డైరె క్టర్ ప్రవీణ్ అన్నాడు. మంచి సినిమా చేశాం.. ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయదని నిర్మాతలు అన్నారు.