MassJatharaTeaser: ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్.. అభిమానులకు రవితేజ, శ్రీలీల ఫుల్ మీల్స్..

MassJatharaTeaser: ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్..  అభిమానులకు రవితేజ, శ్రీలీల ఫుల్ మీల్స్..

రవితేజ, బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర (MASS Jathara). మనదే ఇదంతా క్యాప్షన్. రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీ, షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.  వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్టు 11న) మాస్ జాతర టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ పవర్‌‌‌‌ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించనున్నాడు. శ్రీలీల స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది.

టీజర్ విషయానికి వస్తే.. ఇక్కడో కాలేజ్ స్టూడెంట్ని చంపేశారు సార్ అంటూ టీజర్ సార్ట్ అయింది. వాడీ బ్యాక్ గ్రౌండ్ ఏంటని విలన్ ప్రశ్నించగా.. 'సింగిల్.. నో బ్యాక్ గ్రౌండ్' అన్నట్టుగా రవితేజ ఎంట్రీ అదిరింది. ఆ తర్వాత రవితేజ కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్‌‌‌‌‌‌‌‌ ని చూపించిన విధానం బాగుంది. రవితేజ స్వాగ్, ఎనర్జీని బాగా చూపించాడు డైరెక్టర్ భాను. టీజర్ ఆద్యంతం పూర్తి స్థాయి మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా మలిచాడు భాను.

అంతేస్థాయిలో రవితేజలోని కామెడీ యాంగిల్ని చూపించి సినిమాపై ఆసక్తి తీసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా రవితేజ, శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ తమ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్లా ఉండటం గ్యారెంటీ అనేలా క్యూరియాసిటీ పెంచాడు డైరెక్టర్. చివర్లో ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాలేదు అన్నాడని రాజేంద్రప్రసాద్ అనగా.. 'అడ్రస్ పెడితే ఏం చేస్తావ్.. స్విగ్గిలో పెట్టి ఆర్డర్ చేస్తావా' అని రవితేజ చెప్పిన టైమింగ్ డైలాగ్ అదిరింది. 

►ALSO READ | ఇవాల్టీ (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ బంద్.. 

ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ టీజర్కు ప్రధాన బలంగా నిలిచింది. ఈ మూవీని సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.