
ప్రేమమ్ సినిమాతో సినీ తెరకు పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తమిళ ప్రేమమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది. సోషల్ మీడియాలో అనుపమకు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 13 మిలియన్లకు పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప్రూవ్ చేసుకుంటోంది ఈ కేరళ కుట్టి.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పెట్టి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఉంగరం వేలికి ఓ కవర్‌ను చుట్టుకుని ‘ఎంగేజ్డ్’ అంటూ పోస్ట్ పెట్టింది. దానికి లాఫింగ్ ఎమోజీని జత చేసి సరదాగా ఆటపట్టించింది. నిజంగానే ఎంగేజ్మెంట్చేసుకున్నావా ఏంటి అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌కు కామెంట్లు చేస్తున్నారు. ‘కార్తికేయ 2’తో ప్యాన్ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సిద్ధూ జొన్నలగడ్డతో టిల్లూ స్క్వేర్ చేస్తోంది. దీంతో పాటు తమిళ, మళయాల సినిమాలతోనూ బిజీగా ఉంది.