సూర్య IPS’ చిత్రంలోని సాంగ్ రీమిక్స్

సూర్య IPS’ చిత్రంలోని సాంగ్ రీమిక్స్

‘రావణాసుర’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచిన దర్శకుడు సుధీర్ వర్మ... టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవితేజను డిఫరెంట్ షేడ్స్‌‌‌‌‌‌‌‌లో చూపించి.. ఆ ఆసక్తిని మరింత పెంచాడు. మరోవైపు ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా.. మూడో పాటను బుధవారం విడుదల చేశారు. ‘వెయ్యినొక్క జిల్లాల వరకూ’ అంటూ సాగే పాటను అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా పాడాడు. వెంకటేష్ హీరోగా నైంటీస్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘సూర్య IPS’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు రీమిక్స్ ఇది. అప్పట్లో ఇళయరాజా కంపోజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ పాటను సీతారామశాస్త్రి రాశారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ రెట్రో స్టయిల్‌‌‌‌‌‌‌‌లో దీన్ని కంపోజ్ చేశాడు. కాస్ట్యూమ్స్ నుండి సెట్స్ వరకు రెట్రో ఫీల్ ఇవ్వడానికి జాగ్రత్తలు తీసుకున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో రవితేజకు జంటగా మేఘా ఆకాష్ కనిపించింది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.