రాబోయే ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్ చిత్తుగా ఓడిపోతుంది

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్ చిత్తుగా ఓడిపోతుంది


హైదరాబాద్, వెలుగు:  టీఆర్​ఎస్​ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, ఆ డబ్బులను సీఎం కేసీఆర్ తన కుటుంబానికి తరలించారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. శనివారం మాదాపూర్ లోని ఓ హోటల్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కేసీఆర్ లాంటి నాయకులకు ప్రధాని మోడీ పాపులారిటీ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై కేసీఆర్ ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్ చిత్తుగా ఓడిపోతుందని, బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్ విహార యాత్ర చేసుకోవచ్చని కామెంట్ చేశారు.