
టాలీవుడ్ స్వీటీ అనుష్క ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో తన మలయాళ సినీ ఎంట్రీని ప్రకటించింది. 14 భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అనుష్క నటిస్తోంది.
‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’ పేరుతో రానున్న ఈ హారర్ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌లో అనుష్క లుక్‌ను విడుదల చేశారు. ఈ వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.