వేదంలో సరోజలా.. ఘాటిలో శీలావతి

వేదంలో సరోజలా.. ఘాటిలో శీలావతి
  • మెమరబుల్ రోల్ అవుతుంది

‘ఘాటి’ చిత్రం  ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని, ఇలాంటి కథకు ఇదే  సరైన సమయం అని చెప్పింది అనుష్క. ఆమె లీడ్‌‌‌‌గా  క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ప్రమోషన్స్‌‌‌‌కు హాజరుకానని ముందుగానే మేకర్స్‌‌‌‌కు క్లారిటీ ఇచ్చిన అనుష్క.. రానా దగ్గుబాటితో జరిపిన ఫోన్‌‌‌‌ సంభాషణలో  ఈ సినిమా కంటెంట్, తన పాత్ర గురించి  పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ‘‘ఇదొక  వైలెంట్, ఇంటెన్స్ మూవీ.

వైలెన్స్‌‌‌‌ను పక్కన పెడితే  ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు ఈ సినిమా సరిగ్గా  సరిపోతుంది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో  బాహుబలి, అరుంధతి వరుసలో ఘాటి కూడా  నిలుస్తుంది.  ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో కథ జరుగుతుంది. ఈ బ్యాక్‌‌‌‌డ్రాప్, విజువల్స్ ఆడియెన్స్‌‌‌‌కి  కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇందులో ప్రతి క్యారెక్టర్  ఆర్గానిక్‌‌‌‌గా ఉంటుంది. మనం కోల్పోయిన దాంట్లోంచి మళ్లీ లేచినప్పుడే మనం మరింత గొప్పగా మారుతాం అని  ఈ కథను చెప్పిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటుంది. 

 క్రిష్‌‌‌‌ గారు నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. ‘వేదం’లో సరోజ లాంటి  సున్నితమైన పాత్రలో  గొప్పగా చూపించా రు. నా కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే పాత్ర అది. ఇప్పుడు ‘ఘాటి’లో శీలావతి కూడా అలాంటి మెమరబుల్ క్యారెక్టర్ అవుతుంది’ అని చెప్పింది.  అలాగే ఈ ఏడాది చివర్లో  కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తానని అనుష్క కన్ఫర్మ్ చేసింది.