కూతురికి ‘వామిక’ గా నామకరణం చేసిన విరుష్క జంట

కూతురికి ‘వామిక’ గా నామకరణం చేసిన విరుష్క జంట

ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ , హీరోయిన్ అనుష్క శ‌ర్మ ల జంట జ‌న‌వ‌రి 11, 2021 పండంటి కూతురికి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ దంప‌తులు త‌మ కూతురికి వామిక అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ విష‌యాన్ని అనుష్క‌ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. మేం ఇద్ద‌రం ఇద్దరం ప్రేమ, గౌరవం, ఉనికితో కలిసి బతికాం… వామిక మా ప్రేమను మరో స్థాయికి చేర్చింది. వామికా రాక‌తో మా జీవితాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆనందం, క‌న్నీళ్ళు, బాధ ఇలా నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఎన్నో భావోద్వేగాలు. అయిన‌ప్ప‌టికీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అంటూ అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు.