Anushka Sharma– Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల లవ్లీ మూమెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇవాళ (2026, జూన్ 1న) అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
కోహ్లీ నుదుటిపై అనుష్క కిస్:
ఆ ఫోటోలో అనుష్క.. విరాట్ కోహ్లీ నుదుటిపై ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించారు. ఆర్‌సీబీ చారిత్రాత్మక విజయానికి సంబంధించిన భావోద్వేగాలన్నింటినీ ఈ ఒక్క ఫోటో ప్రతిబింబించింది. ఈ క్యూట్ పిక్‌కు అనుష్క కేవలం విక్టరీ సైన్, హార్ట్, నమస్తే ఎమోజీలను మాత్రమే క్యాప్షన్‌గా పెట్టింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోటోకు మిలియన్స్ లైకులు వచ్చాయి.
స్టేడియంలో అనుష్క శర్మ హంగామా:
ఆదివారం (మే 31) రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్‌సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కోహ్లీ సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించగానే స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ ఆనందంతో కేరింతలు కొట్టింది. విరాట్ గ్రౌండ్‌లో ఉండగా.. అనుష్క స్టాండ్స్ నుంచి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ కెమెరాల కంటికి చిక్కిపోయింది. అనంతరం కింగ్ కోహ్లీ 'Once felt nice, we did it twice' (ఒకసారి బాగుంది, అందుకే రెండోసారి చేశాం) అనే స్లోగన్ ఉన్న టీ-షర్ట్ ధరించి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోను కూడా అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
ఫ్యాన్స్ ఫిదా.. మోస్ట్ హోల్‌సమ్ కపుల్:
ఈ ఫోటోలపై ఆర్‌సీబీ ఫ్యాన్స్, నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లోనే ఇది అత్యంత బెస్ట్ అండ్ క్యూట్ మూమెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 11, 2017న ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ కపుల్‌కు కుమార్తె వామిక (జనవరి 11, 2021), కుమారుడు అకాయ్ (ఫిబ్రవరి 15, 2024) ఉన్నారు. ఆర్‌సీబీ గెలుపు కంటే కూడా విరుష్క జోడీ కెమిస్ట్రీనే సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతోంది.
