క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌తో అనుష్క శర్మ రీఎంట్రీ

క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌తో అనుష్క శర్మ రీఎంట్రీ

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 23వ సినిమా.  ఇందులో హీరోయిన్‌‌‌‌గా శ్రద్దా కపూర్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేసినట్టు ఇటీవల వార్తలొచ్చాయి.  దీనిపై ఇంకా స్పష్టత రాకముందే.. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో మరో బాలీవుడ్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ పేరు వినిపిస్తోంది. అనుష్క శర్మ ఇందులో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె సినిమాలకు దూరమై ఎనిమిదేళ్లు అవుతోంది.

షారుక్ ఖాన్‌‌‌‌ ‘జీరో’ తర్వాత నటిగా తన కెరీర్‌‌‌‌‌‌‌‌కు ఆమె బ్రేక్ ఇచ్చింది.  ‘చక్‌‌‌‌ దా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌’ పేరుతో ఓ బయోపిక్ చేసినప్పటికీ అది విడుదలకు నోచుకోలేదు. ఇక బన్నీ ప్రాజెక్ట్‌‌‌‌తో పాటు మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రస్టేజియస్ మూవీ ‘వారణాసి’లోనూ అనుష్క శర్మ పేరు వినిపిస్తోంది. ఇందులోని ఓ కీలకపాత్రకు ఆమెను సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా తన రీఎంట్రీ సౌత్‌‌‌‌ ఇండియా నుంచి రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌తో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.