Virat Kohli:కూతురు వామికతో ఆశ్రమానికి విరుష్క జంట

 Virat Kohli:కూతురు వామికతో  ఆశ్రమానికి విరుష్క జంట

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ యూపీలోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. విరుష్క జంట గారాలపట్టి అయిన కూతురు వామికతో కలిసి వెళ్లారు. ఆశ్రమంలో జరిగిన ఉపన్యాసానికి హాజరయ్యారు. సంత్ ప్రేమానంద్ మహారాజ్ చేసిన ఆధ్యాత్మిక ప్రభోదాలను విరుష్క జంట ఆసక్తి విన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో వామికను విరాట్ కోహ్లీ పట్టుకున్నప్పుడు అనుష్క సాష్టాంగ నమస్కారం చేసింది. 

న్యూ ఇయర్  సెలబ్రేషన్స్ ను దుబాయ్ లో ఫ్రెండ్స్ తో జరుపుకున్న ఈ జంట ఉత్తరాఖండ్ లోని బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు.ఈ క్రమంలో అక్కడి ఆశ్రమవాసులతో మాట్లాడి వారి మంచిచెడ్డలు తెలుసుకున్నారు. దాదాపు గంటసేపు ఆశ్రమంలోనే ఉన్న ఈ జంట.. కొంతసేపు బాబా సమాధి వద్ద ధ్యానం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడి ఆశ్రమవాసులతో మాట్లాడి వారి మంచిచెడ్డలు తెలుసుకున్న విరుష్క జంట, వారికీ దుప్పట్లు పంచి తమ ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.