Ghaati Box Office: దారుణంగా పడిపోయిన ఘాటి బాక్సాఫీస్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంతంటే? భారీ నష్టాలు తప్పవా?

Ghaati Box Office: దారుణంగా పడిపోయిన ఘాటి బాక్సాఫీస్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంతంటే? భారీ నష్టాలు తప్పవా?

అనుష్క నటించిన ‘ఘాటి’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. తొలిరోజు (సెప్టెంబర్ 5) ఇండియాలో రూ.2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో రెండో రోజు శనివారం ఘాటి మరింత దారితప్పింది. కేవలం రూ.1.74 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 23% ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసుకుంది. రెండ్రోజుల్లో ఘాటి మొత్తం కలెక్షన్లు రూ.3.5 కోట్లకు చేరుకుంది.

అయితే, అనుష్క స్టార్‌డమ్‌ను పరిగణనలోకి తీసుకుని చూస్తే మాత్రం.. భారీ డిజాస్టర్‌ కలెక్షన్స్ రాబడుతుందనే చెప్పుకోవాలి. గతంలో అనుష్క సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చిన పలు సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఇంతటి డిజాస్టర్ కలెక్షన్స్ సాధించడం మాత్రం ఇదే తొలిసారి!

అనుష్క నటించిన గత మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మొదటి రోజు రూ.2.4 కోట్లనెట్, రెండో రోజు రూ.2.23 కోట్లు వసూలు చేసింది. ఇపుడు చాలా గ్యాప్ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటించి హిట్ కొట్టలేకపోయింది. అయితే, ఘాటిలో అనుష్క చేసిన యాక్షన్ సీక్వెన్స్, యాక్టింగ్‌కు మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. 

ALSO READ : Maalik OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న గ్యాంగ్‌స్టర్‌ క్రైమ్‌ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగులో ఘాటితోపాటు విడదలైన మరో సినిమా లిటిల్ హార్ట్స్. ఇది పేరుకే చిన్న సినిమా. కానీ, వసూళ్ల వేగంతో దూసుకెళ్తుంది.  పాజిటివ్ టాక్తో ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ డే లిటిల్ హార్ట్స్ మూవీ రూ.1.32 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండోరోజు శనివారం రూ.2.5 కోట్లు నెట్ సాధించి.. ఏకంగా 85.19% ఎక్కువ రేట్లతో కలెక్ట్ చేసింది. 

ఘాటి బడ్జెట్ & బ్రేక్ ఈవెన్:

ఘాటి సినిమాకు దాదాపు రూ.50 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించినట్లు టాక్. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని ఇంత మొత్తం అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ.52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది.

ఈ క్రమంలో ఘాటి బ్రేక్ ఈవెన్ పూర్తి చేయాలంటే రూ.55 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఘాటికి నష్టాలూ తప్పేలా లేవని తెలుస్తోంది.