ఇది విన్నారా: చిరు-బాబీ మూవీలో హీరోయిన్గా అనుష్క శెట్టి? విలన్గా మంచు మనోజ్!

ఇది విన్నారా: చిరు-బాబీ మూవీలో హీరోయిన్గా అనుష్క శెట్టి? విలన్గా మంచు మనోజ్!

మెగాస్టార్ చిరంజీవి 70ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అందించిన బాబీతో ఓ మూవీ చేయనున్నాడు చిరు. ఇటీవలే ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి, భారీ అంచనాలు పెంచారు. అయితే, ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ ఎవరనేది మెగా ఫ్యాన్స్లో మెదులుతున్న ప్రశ్న! 

లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. చిరంజీవికి జోడీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఈ క్రేజీ ఆఫర్ పై అనుష్క పాజిటివ్‌గా రెస్పాన్స్ అయినట్లు టాక్. అయితే, అందుకు కారణం లేకపోలేదు.. అనుష్క తన సినీ కెరియర్లో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్స్తో పాటుగా మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, వంటి హీరోస్తో కూడా నటించింది. కానీ, ఇప్పటివరకు చిరుతో మాత్రం నటించలేదు.

అయితే, గతంలో చిరంజీవితో కలిసి నటించాలన్న కోరిక ఉన్నట్లు స్వీటీ తెలిపింది. ఈ క్రమంలోనే మెగా 158లో హీరోయిన్గా అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే ఘాటీ మూవీతో ప్రేక్షకులని పలకరించింది స్వీటీ!

ఇదిలా ఉంటే.. మెగా 158 నుంచి మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. మిరాయ్తో తనలోని పవర్ ఫుల్ విలనిజం చూపించిన మంచు మనోజ్.. ఈ సినిమాలో చిరుని ఢీ కొట్టనున్నాడట. మనోజ్ కోసం ఓ పవర్ ఫుల్ రోల్ని డైరెక్టర్ బాబీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మిరాయ్ సెలబ్రేషన్స్లో నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది మనోజ్ అన్న అని జ్ఞాపకాలు పంచుకున్నారు బాబీ.

ఈ క్రమంలోనే బాబీ మిరాయ్ ఈవెంట్కి రావడంతో టాక్ మరింత పెరిగింది. చూడాలి మరి ఏమవుతుందో! ఏదేమైనా.. తండ్రి మోహన్ బాబు విలక్షణ నటనని అందిపుచ్చుకున్న మనోజ్, ఇలానే హీరోగా, విలన్గా నటిస్తూ బిజీగా ఉండాలని మంచు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

మెగా 158:

చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న సందర్భంగా 'మెగా 158' గురించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ అక్టోబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దసరా పండుగను పురస్కరించుకుని ఇది సినిమాకు ఒక శుభారంభాన్ని ఇస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టారు. ఈ సినిమా లాంగ్ రన్లో ఏకంగా రూ.236 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు 'మెగా 158'లో అంతకు మించిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని, ఇది అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్గా అవుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లోని బ్యాక్‌డ్రాప్, ఫస్ట్ లుక్ డిజైన్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా, బాబీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కన్నడ బడా బ్యానర్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' నిర్మిస్తుంది. యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్, దళపతి విజయ్ జన నాయకుడు వంటి భారీ సినిమాలను నిర్మిస్తుంది ఈ సంస్థనే. 

ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే భారీ చిత్రం 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్యలోనే బాబీతో మూవీ అనౌన్స్ చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చిరు ఓ మూవీ చేయనున్నారు.