
బ్యాంకాక్: థాయ్ లాండ్ నూతన ప్రధానిగా అనుతిన్ చార్న్ విరాకుల్ నియమితులయ్యారు. అనుతిన్ భూమ్ జైతై పార్టీకి చెందిన సీనియర్ నేత. బ్యాంకాక్ లోని తన పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన వేడుకలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ వేడుకకు అనేక మంది సీనియర్ రాజకీయ నేతలు హాజరయ్యారు. మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
అనుతిన్ చార్న్ విరాకుల్ షినవత్ర నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. గత రెండేండ్లలోనే థాయ్‌లాండ్‌కు ఆయన మూడో ప్రధాని కావడం గమనార్హం. కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్ సేన్ తో థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర ఫోనులో మాట్లాడడంతో వివాదం రేగింది. దీనిపై విచారణ జరిపిన దేశ రాజ్యాంగ న్యాయస్థానం షినవత్రకు ప్రధాని పదవి నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.