వైన్స్ షాపులకు ఒక్కరు ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చు

వైన్స్ షాపులకు ఒక్కరు  ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చు

వికారాబాద్, వెలుగు: నూతన మద్యం పాలసీలో వైన్స్​షాపులకు ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, వారికి ఎన్ని షాపులు వచ్చినా లైసెన్స్​ జారీ చేస్తామని వికారాబాద్​ జిల్లా ఎక్సైజ్​, ప్రొహిబిషన్​ అధికారి విజయభాస్కర్​ గౌడ్​ ప్రకటించారు. బుధవారం ఆయన తన చాంబర్​లో మాట్లాడారు. 

వికారాబాద్​ జిల్లాలో 59 మద్యం షాపులకు గానూ గత నెల 26 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 6 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏదైనా వైన్స్​షాపునకు తగినన్ని దరఖాస్తులను రాకుంటే, ఆ షాపు డ్రా విషయం కమిషనర్​ నిర్ణయానికి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అసిస్టెంట్​ ఎక్సైజ్​, ప్రొహిబిషన్​ అధికారి శ్రీనివాస్​రెడ్డి, వికారాబాద్​ ఎస్​ఐ నిరంజన్​ తదితరులు పాల్గొన్నారు.