ప్రేమ కోసం ఏదైనా..PUBG ద్వారా పరిచయం.. వ్యక్తిని కలవడానికి నలుగురు పిల్లలతో ఇండియాకు

ప్రేమ కోసం ఏదైనా..PUBG ద్వారా పరిచయం.. వ్యక్తిని కలవడానికి నలుగురు పిల్లలతో ఇండియాకు

ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే వాళ్ళున్నారు. ప్రేమ కోసం ఏమైనా చేసే వాళ్ళూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ తాజా సంఘటన. ప్రేమ కోసం ఓ పాకిస్థానీ మహిళ.. ఇండియాకు వచ్చింది. ఆన్‌లైన్ గేమ్ పబ్ జీ ద్వారా పరిచయం అయిన యువకుడిని కలుసుకునేందుకు ఆ మహిళ అక్రమంగా సరిహద్దు దాటింది. మరో విస్తు పోయే విషయం ఏంటంటే.. ఆ మహిళకు నలుగురు పిల్లలు కూడా.

గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్, పాకిస్థాన్ కు చెందిన సీమా గులాం హైదర్ ఆన్లైన్ గేమ్ పబ్ జీ ద్వారా పరిచయం అయ్యారు. ఇంటర్నెట్ లో చాట్ చేసుకుంటూ వారిద్దరూ ఒక్కటయ్యారు. అలా వారి పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. ఆ తర్వాత ఇండియాలో ఉన్న వ్యక్తి కోసం ఆ మహిళ పాకిస్థాన్ నుంచి అక్రమంగా ప్రవేశించింది. అలా వారిద్దరూ నలుగురు పిల్లలతో కలిసి మే నెల నుంచి ఓ అపార్ట్మెంట్ లో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలేసులు అక్కడికి  చేసుకుని, విచారణ ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సీమా పాకిస్థాన్‌లో గృహహింస బాధితురాలు. ఆమెకు సౌదీ అరేబియాలో పనిచేసే ఒక పాకిస్థానీ వ్యక్తితో వివాహమైంది. అతను ప్రతి చిన్న విషయానికి తనను కొట్టేవాడు. నాలుగేళ్లుగా అతడిని ఆమె కలవలేదని, తన సోదరుడు పాకిస్థాన్ సైన్యంలో ఉన్నాడని కూడా ఆమె చెప్పింది. అక్కడే నివాసముంటున్న అపార్ట్‌మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు సమాచారం అందించడంతో.. సచిన్, సీమాలను పోలీసులు పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.