కుల సంఘాల ఐక్యతతో ఏదైనా సాధ్యం ..హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

కుల సంఘాల ఐక్యతతో ఏదైనా సాధ్యం ..హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

హనుమకొండ, వెలుగు: ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు చూపిన మార్గంలోనే నడవాలని హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కుల సంఘాల ఐక్యతతో ఏదైనా సాధ్యమవుతుందని, గొల్ల, కురుమల ఐక్యత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. వరంగల్ లో శనివారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా హనుమకొండ రాంనగర్ బీసీ భవన్ లో ‘ ప్రజలే నా ఆత్మకథ’ బుక్ ను ఆవిష్కరించారు. 

అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు, గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనానికి  చీఫ్​గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మహాభారతం, భగవద్గీతను చదవాలని సూచించారు.  కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,  వివిధ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కొండేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.