రాజధాని రగడ… హైపవర్ కమిటీ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం

రాజధాని రగడ… హైపవర్ కమిటీ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం

ఉత్కంఠగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రెండింగ్ పై లోకాయుక్త విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల అర్బన్ డెవ్ లప్ మెంట్ అథారిటీ,అమరావతి మెట్రోపాలిటిన్ రీజినల్ డెవ్ లప్ మెంట్ అథారిటీకి ఆమోదం తెలిపింది. విశాఖలో సచివాలయం,హెచ్ వోడీ కార్యాలయాలు అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని  కేబినెట్ నిర్ణయించింది. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, భూములిచ్చిన రైతులకు 15 ఏళ్లు కౌలు, పరిహారం రూ. 2500 నుంచి 5000 వేలకు పెంచాలని నిర్ణయించింది కేబినెట్.

see more news

ప్రియురాలిని పెళ్లాడిన ‘ట్రిపుల్ సెంచరీ వీరుడు‘

రాచరికానికి గుడ్ బై చెప్పిన హ్యారీ, మెగన్