ఢిల్లీ నుంచి చంద్రబాబు కోసం దిగిన లాయర్లు

ఢిల్లీ నుంచి చంద్రబాబు కోసం దిగిన లాయర్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ...  విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ  కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు.  చంద్రబాబుని 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును తమ రిమాండ్‌కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరనుంది. ఈ క్రమంలో.. ఆయన్ని నేరుగా సిట్‌ ఆఫీస్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తాడేపల్లి సిట్‌ కార్యాలయం పోలీసుల అదుపులో ఉంది. సిట్‌ ఆఫీస్‌ వెళ్లే దారులను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. 

ALSO READ :చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరా: నారా భువనేశ్వరి

చంద్రబాబు కోసం ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్ 

మరోవైపు.. చంద్రబాబు కేసును వాదించడానికి ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లు విజయవాడకు చేరుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసును ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆయన్ను విజయవాడకు తెలుగుదేశం పిలిపించింది. ఇప్పటికే లూథ్రా తన టీమ్‌తో కలిసి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు ఇతర కేసులను కూడా లాయర్ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీత తరపు వాదనలు వినిపించింది కూడా అడ్వకేట్ సిద్ధార్థే. గతంలో అమరావతి భూముల కేసును కూడా వాదించారు.  ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ గా ఉన్నారు  సిద్ధార్థ్ లాూథ్రా. మరోవైపు.. తెలుగుదేశం లీగల్ సెల్ కూడా బెయిల్ పిటిషన్ తయారు చేస్తోంది.

సీఐడీ పోలీసులు శనివారం (సెప్టెంబర్ 9వ తేదీ) తెల్లవారుజామున అరెస్టు చేశారు.