నీళ్లపై రాజకీయం చేయొద్దు : ఏపీ సీఎం చంద్రబాబు

నీళ్లపై రాజకీయం చేయొద్దు : ఏపీ సీఎం చంద్రబాబు

సున్నితమైన నీళ అంశాలు రాజకీయలు చేయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు అమలు చేశానని చెప్పారు. బీమా, దేవాదుల, సహా అన్ని ప్రాజెక్టులకు తానే రూపకల్పన చేశానని తెలిపారు. సముద్రంలోకి నిరుపయోగంగా పోయే నీళ్లను ఉపయోగించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

తెలంగాణ ,ఏపీ రెండు గోదావరి జలాలను ఉపయోగించుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.  కృష్ణా జలాల విషయంలోనే కొంత సమస్య ఉంది.  రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోనే  ఏపీ తన వాటాను ఉపయోగించుకుంటుంది.  సముద్రంలో వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నాం.  సున్నిత అంశాల్లో రాజకీయాలు సరికాదు.  ఏపీ చివర్లో ఉన్న రాష్ట్రం  అని చంద్రబాబు అన్నారు. 

ఏపీ శ్రీశైలం,నాగార్జున సాగర్ నుంచి పరిమితికి మించి నీళ్లను తరలిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని..నీళ్ల దోపిడికి అడ్డుకట్ట వేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. గత పదేళ్లలో 1200 టీఎంసీలకు పైగా నీళ్లను ఏపీ తరలించిందని తెలంగాణ మంత్రులు ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు స్పందించారు.