జగన్ కూల్చిన ప్రజా వేదిక పరిశీలించిన సీఎం చంద్రబాబు

జగన్ కూల్చిన ప్రజా వేదిక పరిశీలించిన సీఎం చంద్రబాబు

అమరావతి ఏరియాలో.. సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న కూల్చిన ప్రజా వేదికను పరిశీలించారు సీఎం చంద్రబాబు. 2019లో జగన్ సీఎం అయిన వెంటనే.. అక్రమ నిర్మాణం అని.. అనుమతులు లేకుండా.. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించారంటూ ప్రజా వేదిక భవనాన్ని కూల్చారు జగన్. కూల్చిన తర్వాత ఆ శిథిలాలను అలాగే వదిలేశారు.. వాటిని తొలగించలేదు ఈ ఐదేళ్లు.. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి..

చంద్రబాబు మళ్లీ సీఎం కావటం.. అమరావతి నిర్మాణాలు ఊపందుకోవటంతో.. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. 2024, జూన్ 20వ తేదీ రాజధాని అమరావతి ప్రాంత పర్యటనలో భాగంగా.. కూల్చిన ప్రజా వేదికను పరిశీలించారు చంద్రబాబు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు సీఎం చంద్రబాబు. వందల కోట్ల రూపాయలతో ప్రజా వేదిక నిర్మాణం చేస్తే.. నియంతృత్వ పోకడలతో.. ప్రజా ధనంతో కట్టిన అద్భుతమైన భవనాన్ని జగన్ కూల్చివేశాడు అంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

ప్రజా వేదికను కూల్చిన జగన్ కు.. ప్రజలే సరైన బుద్ధి చెప్పారని.. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదన్నారు సీఎం చంద్రబాబు.