సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన

సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్  ప్రకటన

2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. ఏప్రిల్ 19వ తేదీ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం, నౌపడ దగ్గర పోర్ట్ నిర్వాసితుల కాలనీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు జగన్.

రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అని.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు జగన్. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా ఉండాలని.. మీ బిడ్డకు మీరే సైనికులు అని పిలుపునిచ్చారు జగన్.

మీ బిడ్డ ఒక్కడే ఒక వైపు ఉంటే.. నాతో చీకటి యుద్ధం చేయటానికి పెత్తందార్లు అన్నీ ఒక్కటి అయ్యాయని టీడీపీ, జనసేన పార్టీలకు చురకలు అంటించారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాతో యుద్ధం చేస్తున్నారని.. ఈ యుద్ధంలో నా దైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరే అని.. మీ చల్లని ఆశీస్సులు కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. తోడేళ్లు అన్నీ ఒకమైనా మనం ఒంటరిగా పోటీ చేస్తామని.. దైర్యంగా ఎదుర్కొంటామని.. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు దేవుడి దయతో మనమే గెలుస్తామన్నారు జగన్.