నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తుంటే గర్వంగా ఉంది

నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తుంటే గర్వంగా ఉంది

వైఎస్ జగన్ ప్యారిస్ పర్యటనలో ఉన్నారు.తమ కూతురు గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ లో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు జగన్. ‘‘ డియర్ హర్షా..నీ అద్భుతమైన ఎదుగుదలను చూసి మాకెంతో గర్వంగా ఉంది. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్ లో పాసవ్వడంతో పాటు డీన్స్ జాబితాలో చోటు సంపాదించడం పట్ల సంతోషంగా ఉంది’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇక ఇన్సీడ్ లో చేరడానికి ముందు ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివారు. 

కాగా హర్షారెడ్డి కాన్వకేషన్ కోసం జూన్ 28న ప్యారిస్ వెళ్లిన జగన్ జులై 3న తిరిగి రానున్నారు. జులై 4న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి జగన్ స్వాగతం పలకనున్నారు.