ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

 ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా  ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులు, విభజన సమయంలో పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని మోడీని కోరినట్లు తెలుస్తోంది.

అలాగే  పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు,  ఏపీకి ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనట్లు సమాచారం. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు.