కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్..

కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. జనవరి 4వ తేదీ గురువారం హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్... మోకాలికి శస్త్రచికిత్స అయిన కేసీఆర్ ను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ రాజకీయ జీవతంలోకి రావాలని.. ప్రజల తరుపున పోరాడాలని జగన్ కోరారు. సర్జరీ అనంతరం యశోద ఆస్పత్రిలో  కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి, పలవురు మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు పరామర్శించిన విషయం తెలిసిందే. 

 ఎర్రవెల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్ 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసింది.

డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. మెడికల్ ఫాలో అప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా బంజారాహిల్స్ నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 3 నుంచి 4 వారాల టైం పడుతుంది.