ఏపీలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లకు బీమా

ఏపీలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లకు బీమా

క‌రోనా బీమా కింద‌కు గ్రామ‌/వార్డు వ‌లంటీర్లు, ఆశా వ‌ర్క‌ర్లు, గ్రామ‌/వార్డు స‌చివాల‌య ఉద్యోగులు, పారిశుద్ధ్య‌ కార్మికుల‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఆదివారం కరోనా నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు.

కరోనా బీమా పరిధిలోకి గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు,గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని జగన్ ఆదేశించారు. క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న క‌ర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌న్నారు. క‌రోనా బాధితుల‌కు ట్రీట్ మెంట్ అందిస్తున్న హాస్పిట‌ల్స్ లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాల‌ని అధికారుల‌కు తెలిపారు సీఎం జ‌గ‌న్.