జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షను ప్రారంభించిన ఏపీ సీఎం

జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షను ప్రారంభించిన ఏపీ సీఎం

2వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి వరకు రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రెండేళ్ల కిందటే భూరికార్డుల ప్రక్షాళన మొదలైందన్నారు. భూవివాదాలన్నింటికీ చెక్ పెడుతామని సీఎం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రెండో దశ కార్యక్రమాన్ని ఏపీ సీఎం ఇవాళ ప్రారంభించారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు. చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయం ప్రజలకు మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని జగన్ ఆరోపించారు.