పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం

పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం

AP సీఎం వైఎస్ జగన్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై ప్రస్తుతం 31 శాతంగా ఉన్న వ్యాట్… ప్రభుత్వ నిర్ణయంతో 32.20శాతానికి పెరిగింది. 22.25 శాతంగా ఉన్న డీజిల్ వ్యాట్.. 27 శాతానికి పెరిగింది. వ్యాట్ పెంపు ఫలితంగా పెట్రోల్, డీజిల్ పై అదనంగా 2 రూపాయలు పెరగనుంది. అయితే వ్యాట్ పై అదనంగా వసూలు చేస్తున్న 2 రూపాయల సెస్ ను ఇకపై వసూలు చేయొద్దంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. సెస్ ను పన్నులోనే కలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?