రేపట్నుంచి 5 రోజులు కుటుంబంతో జగన్ టూర్

రేపట్నుంచి 5 రోజులు కుటుంబంతో జగన్ టూర్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపట్నుంచి ఐదు రోజులపాటు కుటుంబంతోనే గడపాలని నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లయి పాతికేళ్లు నిండనున్న నేపధ్యంలో ఈ ఐదురోజులపాటు భార్య పిల్లలతో కలసి ఉత్తర భారతదేశంలో టూర్ కు ప్లాన్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరి వెళతారు. సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకుంటారు. 
ఈ నెల 28న జగన్ - భారతిల పెళ్లి రోజు 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతిల పెళ్లిరోజు ఈనెల28. పెళ్లి అయ్యి 25 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఆయన ఈ ఐదు రోజుల పాటు కుటుంబంతోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సీఎం అయ్యాక, అంతకుముందు పాదయాత్ర, ఎన్నికల ప్రచారాల వల్ల భార్య పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయారు. కరోనా కారణంగా చాలాకాలం లాక్డౌన్ తో ఎక్కడకూ వెళ్లలేకపోయారు. తాజాగా పరిస్థితులన్నీ సద్దుమణుగుతుండడంతో పెళ్లయి పాతికేళ్లవుతున్న శుభ సందర్భాన్ని భార్యా పిల్లలతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.