
ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సిందూర్ ను దేశం మొత్తం స్వాగతిస్తోందని అన్నారు.ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం గొప్ప విషయమని అన్నారు పవన్ కళ్యాణ్. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ చర్య అని అన్నారు. మోడీ నిర్ణయానికి ప్రతిఒక్కరు మద్దతుగా నిలిచారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. మతం అడిగి మరీ చంపడం అత్యంత క్రూరమైన చర్య అని అన్నారు.
దేశ భద్రత విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మాట్లాడాలని.. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు పవన్ కళ్యాణ్. దేశభద్రత విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెట్టాల్సిందే అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు పవన్. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని.. ఉగ్రదాడిని దేశమంతా ఖండించిందని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయని.. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే.. పాకిస్తాన్ కు వెళ్ళిపోండంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొందరు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాత్రమే అన్నానని అన్నారు.దేశ భద్రత విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మాట్లాడాలని.. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు పవన్ కళ్యాణ్.