కరోనా బాధితులను సర్ ప్రైజ్ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి

కరోనా బాధితులను సర్ ప్రైజ్ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి

వీడియో కాన్ఫరెన్సులో స్వయంగా బాధితులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఆళ్లనాని

అనంతపురం: కరోనా పేషెంట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.. ప్రైవేటు ఆస్పత్లు చేతులెత్తేశాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకోవడం లేదన్న రకరకాల భయాందోళనలు వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఏపీలోని అనంతపురం జిల్లాలోని క్వారెంటైన్ సెంటర్లలో ఉన్న కరోనా పాజిటివ్ బాధితులకు డిప్యూటీ సీఎం అయిన ఆళ్ల నాని సర్ ప్రైజ్ చేశారు. అధికారులతో సమీక్షకు ముందు.. వాస్తవాలు తెలుసుకుందామంటూ.. క్వారెంటైన్ సెంటర్లలో ఉన్న వారితో వీడియో కాల్ చేసి మాట్లాడతానని చెప్పి అధికారులకు షాక్ ఇచ్చారు. ఎవరు ఏం చెబుతారోనన్న అధికారులు… వైద్యులు భయాందోళనలతో ఉంటే.. అవేమీ పట్టించుకోకుండా మంత్రి కాల్ చేసి మాట్లాడారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్న బాధితులకు ఏం జరుగుతోంది.. పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయనతోపాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి… రహదారులు & భవనాలు శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎంపీ లు తలారి రంగయ్య… గోరంట్ల మాధవ్.. ఎమ్మెల్యేలు అనంత వేంకటరామిరెడ్డి… తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి… శ్రీదర్ రెడ్డి… పివి సిధార్థ రెడ్డి.. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు…వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.  మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యే లు జూమ్ కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.

జేఎన్టీయూ, పీవీకేకే కోవిడ్ కేర్ సెంటర్లు,  కిమ్స్ సవేరా, ఆర్డీటీ, బత్తలపల్లి కోవిడ్ ఆస్పత్రులోని పాజిటివ్ వ్యక్తులతో మాటామంతి జరిపారు. పిచ్చాపాటి మాట్లాడుతున్నట్లు మాట్లాడి.. మీకు ఆహారం సరిపోతోందా.. మంచి రుచిగా ఉందా..  లేదా..  పారిశుద్ధ్యమ్ వైద్య సేవలందించడంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా అంటూ అడిగారు మంత్రులు ఆళ్ల నాని, శంకరనారాయణ. ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అన్నీ చాలా బాగున్నాయన్న పాజిటివ్ వ్యక్తులు తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని నొక్కి అడిగినా ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆహారం విషయంలో కానీ, వైద్య సేవలు సరిగా అందుతున్నాయి లేదా అనే విషయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీ లేకుండ ఉండాలని సూచించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రోజుకు ఫుడ్ కోసం రూ. 500 ఇస్తోంది.. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా చెప్పండి.. అందిస్తున్న సేవలు సరిగా లేకపోతే సరిచేస్తామని మంత్రులు ఆళ్ల నాని, శంకరనారాయణ సూచించారు.