ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల(AP CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు

  • ఏపీ ఐసెట్(AP ICET) - మే 6న
  • ఏపీ ఈసెట్(AP ECET) - మే 8న
  • ఏపీ పీజీఈసెట్(AP PGECET)- మే 29 నుంచి 31 వరకు
  • ఏపీ పీజీసెట్(AP PGCET)- జూన్ 3 నుంచి 7 వరకు
  • ఏపీ ఎడ్ సెట్(AP EdCET)- జూన్ 8న
  • ఏపీ లాసెట్(AP LAWCET) - జూన్ 9న
  • ఏపీ ఏడీసెట్(AP ADCET)- జూన్ 13న

ఏ సెట్ ఏ యూనివర్సిటీ నిర్వహణ

వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఏపీ ఈఏపీ సెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఏపీ ఈసెట్(ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను అనంతపురం జేఎన్టీయూ, ఐసెట్(ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలు)ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీఈసెట్, ఆంధ్ర యూనివర్సిటీ (Andhra Univesity) ఎడ్ సెట్‌ను, నాగార్జున యూనివర్సిటీ లా సెట్ ను నిర్వహించనున్నాయి. పీజీ సెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీఈ సెట్‌ను నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించనున్నాయి. ఏపీ ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది