రిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి ఆగ్రహం

రిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి  ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి చిన రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు కేటాయిస్తూ ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం చేశారని గుర్తుచేశారు. తనకున్న రాజకీయ అనుభవంతో చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కాపు రిజర్వేషన్లు రద్దు చేసి కాపుల పట్ల వారి వైఖరి ఎంటో తెలియజేశారన్నారు.

రాష్ట్రంలో నడిచేది ప్రజారాజ్యం కాదని, పోలీస్ రాజ్యమని చినరాజప్ప  అన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని, ఆ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.