ఏపీలో మేయర్, మున్సిపాలిటీల రిజర్వేషన్ల ఖరారు..అక్టోబర్14న ఎన్నికల షెడ్యూల్!

ఏపీలో మేయర్, మున్సిపాలిటీల రిజర్వేషన్ల ఖరారు..అక్టోబర్14న ఎన్నికల షెడ్యూల్!

హైదరాబాద్, వెలుగు: ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను సైతం ఫైనల్ చేసింది.  ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ జీవో జారీ చేశారు.  రాష్ర్టంలో మొత్తం 17 కార్పొరేషన్లు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్, బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా.. నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌‌‌‌‌‌‌‌రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించింది.  

మంగళగిరి -తాడేపల్లి మేయర్ పదవిని ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసింది. రాజమహేంద్రవరం మేయర్ పదవి ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించగా... కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ పదవులను బీసీ జనరల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించింది.

విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జీవీఎంసీ మేయర్ పదవులను జనరల్ మహిళలకు సర్కార్ రిజర్వ్ చేసింది. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ పదవులు అన్‌‌‌‌‌‌‌‌రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించింది. ఏపీలో మొత్తం 132 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో  బీసీ 36, ఎస్సీ 14, ఎస్టీ 3, జనరల్ మహిళ 27, జనరల్ 26, అన్ రిజర్వ్డ్  26 లకు కేటాయించారు.  ఎన్నికల షెడ్యూల్ ను ఈనెల 14న రిలీజ్ చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.